Surprise Me!

Telangana Elections 2018 : కేసీఆర్-పవన్ కళ్యాణ్‌లపై బాబు ఆగ్రహం | Oneindia Telugu

2018-11-16 516 Dailymotion

Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu on Friday clarified why he was going with Congress party in next elections.
#ChandrababuNaidu
#rahulgandhi
#Congress
#tdp
#bjp
#narendramodi
#TelanganaElections2018

పవన్ కళ్యాణ్, కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు బీజేపీకి లబ్ధి చేకూరేలా మాట్లాడుతున్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. బీసీలకు పెద్దపీట వేసేది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు అన్నారు. బీసీలకు తాము రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. బీసీల్లో నాయకత్వం ఎదగకపోతే సమస్యలు పెరిగిపోతాయని చెప్పారు. బీజేపీ చేసిన నమ్మకద్రోహానికి 40 ఏళ్ల పాటు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో జతకలసి వచ్చిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ పార్టీతో జతకలవడంపై చంద్రబాబు లోలోన కుమిలిపోతున్నారా అనే చర్చ సాగుతోంది. ఆయన ఇంకా మాట్లాడుతూ... అందరూ ఈర్ష్యపడేలా రాజధాని అమరావతిని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పారు. అమరావతి ద్వారా ఆదాయం వస్తుందని, దీని ద్వారా అప్పులు తీరుస్తామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని నేను అంత తేలిగ్గా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. వడ్డీతో సహా వసులు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.

Buy Now on CodeCanyon